జూన్‌లో పలు రైళ్లు రీ షెడ్యూల్, మళ్లింపు
ABN , Publish Date - May 22 , 2026 | 12:17 AM
సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూన్‌లో పలు ఒరిజినేటింగ్ రైళ్లను రీ షెడ్యూల్ చేశామని, మరికొన్ని రైళ్లు మళ్లింపు మార్గంలో నడుస్తాయని సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు.
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూన్‌లో పలు ఒరిజినేటింగ్ రైళ్లను రీ షెడ్యూల్ చేశామని, మరికొన్ని రైళ్లు మళ్లింపు మార్గంలో నడుస్తాయని సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు.
రీ షెడ్యూల్: బెంగళూరు-న్యూ టిన్షుకియా (22501) జూన్ 2న 30 నిమిషాలు, 9న 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. టాటానగరం-బెంగళూరు (12889) జూన్ 19, 26 తేదీల్లో గంట ఆలస్యంగా, హటియా-బెంగళూరు (18637) జూన్ 20న గంట ఆలస్యంగా, మల్దా టౌన్-బెంగళూరు అమృతభారత్ (13434) జూన్ 21న 90 నిమిషాలు, జూలై 5న గంట ఆలస్యంగా, హటియా-బెంగళూరు (12835) జూన్ 21న 70, 23న 90 నిమిషాలు ఆలస్యంగా, బెంగళూరు-హటియా (18638) జూన్ 23న 3 గంటలు, 7న రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.
మళ్లింపు: మైసూరు-హౌరా (22818) ఎక్స్‌ప్రెస్ ఈనెల 31, జూన్ 7 తేదీల్లో వయా బెంగళూరు సిటీ జంక్షన్, యలహంక జంక్షన్, ధర్మవరం, గుంటూరు, విజయవాడ మీదుగా, బెంగళూరు-గువహటి (12509) జూన్ 4, 5, 10, 11, 12, జూలై 3 తేదీల్లో వయా యలహంక, ధర్మవరం, విజయవాడ మీదుగా, హౌరా-మైసూరు (22817) జూన్ 5, 12, 19, 26 తేదీల్లో విజయవాడ, నంద్యాల, యలహంక, బెంగళూరు సిటీ మీదుగా, హటియా-బెంగళూరు (18637), బలుర్‌ఘాట్-బెంగళూరు (16524) రైళ్లు జూన్ 6న బంగారపేట, కోలార్, చిక్‌బల్లాపూర్, యలహంక మీదుగా; హటియా-బెంగళూరు (12835) జూన్ 9న వయా ధర్మవరం, యలహంక, బెంగళూరు మీదుగా; బెంగళూరు-ముజాఫర్‌పూర్ (15227) జూన్ 11న ధర్మవరం, విజయవాడ మీదుగా; గువహటి-బెంగళూరు (12510) జూలై 7న విజయవాడ, ధర్మవరం, యలహంక, చిన్నసంద్ర మీదుగా నడుస్తాయి.
నేడు ఆనందపురంలో ప్రజా సమస్యల పరిష్కారం
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పది గంటలకు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరగనున్నది. జాయింట్ కలెక్టర్, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఆనందపురం మండలంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రెవెన్యూ సమస్యలు...ముఖ్యంగా భూ రికార్డులు, రీసర్వే, ఆర్వోఆర్, పట్టాదారుపాస్ పుస్తకాలు, వారసత్వ మార్పులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణ నివారణ తదితర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
పశు సంవర్ధక శాఖ జేడీగా డాక్టర్ నీలయ్య
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
పశు సంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ రెడ్డి నీలయ్య నియమితులయ్యారు. నగరంలోని సెమన్ బ్యాంకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ నీలయ్య ప్రస్తుతం జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పలువురి డీడీలకు జాయింట్ డైరెక్టర్లుగా గురువారం పదోన్నతులు ఇచ్చారు. ఆ జాబితాలో డాక్టర్ నీలయ్య ఉన్నారు. అలాగే జిల్లా జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో డీడీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌కు పదోన్నతి కల్పించి నగరంలోని రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థ జేడీగా నియమించింది.