Share News

తారుమారు సంత కిటకిట

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:16 AM

జి.మాడుగులలో మంగళవారం జరిగిన తారుమారు సంతకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు.

తారుమారు సంత కిటకిట
తారుమారు సంతలో జన సందోహం

అధిక సంఖ్యలో జనం రావడంతో రద్దీ

జి.మాడుగుల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జి.మాడుగులలో మంగళవారం జరిగిన తారుమారు సంతకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. వెంకటరాజ్‌ ఘాట్‌ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిలో ఆస్పత్రి కూడలి, నుర్మతి వెళ్లే జంక్షన్‌ వరకు జనం భారీగా కనిపించారు. సంక్రాంతి సందర్భంగా వస్త్రాలు, నిత్యావసర వస్తువుల అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. దుకాణాలు కిటకిటలాడాయి. రద్దీ నేపథ్యంలో ఈదులబయలు నుంచి నుర్మతి కూడలి మీదుగా పాడేరు, చింతపల్లి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.

Updated Date - Jan 14 , 2026 | 12:17 AM