Share News

పక్కాగా మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:23 PM

జిల్లాలోని ప్రతి సోమవారం మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

పక్కాగా మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ టి.శ్రీపూజ

అధికారులకు కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

పీజీఆర్‌ఎస్‌కు అధికారులు గైర్హాజరైతే చర్యలు

ఐటీడీఏలో 126 వినతులు స్వీకరణ

పాడేరు, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రతి సోమవారం మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో విధిగా హాజరుకావాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయి అఽధికారులు తమ మండలాల్లో పీజీఆర్‌ఎస్‌కు విఽధిగా హాజరుకావాలన్నారు. ఎక్కడ పీజీఆర్‌ఎస్‌ జరిగినా గైర్హాజరైతే వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రతి బుధవారం జిల్లాలో ఏదో మండలంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ, సమస్యల పరిష్కారంపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నదని, ఈక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీకోసంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నంబర్‌ కాల్‌సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నిషాంతి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 126 వినతులను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ సంబంధ సమస్యలపై 46, విద్య, వైద్యం, తాగునీరు, ఇంజనీరింగ్‌ విభాగాలు, విద్యుత్‌, పౌరసరఫరాలకు సంబంధించి 80 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, పీఆర్‌ ఈఈ టి.కొండయ్యపడాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్‌ జి.దాసు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 11:23 PM