Share News

మొబైల్‌ ఫోన్‌ కొనివ్వలేదని... ఇంటికి నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:14 AM

మొబైల్‌ ఫోన్‌ కొనివ్వలేదని... ఇంటికి నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు

మొబైల్‌ ఫోన్‌ కొనివ్వలేదని...  ఇంటికి నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు
ఇంటి లోపల కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

నక్కపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కొత్త మొబైల్‌ ఫోన్‌ కొనుక్కోవడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కోసంతో ఓ యువకుడు సొంత ఇంటిలో పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. దీంతో మంటలు చెలరేగి సామగ్రి, దుస్తులు, గృహోపకరణాలు కాలిపోయాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని చినతీనార్ల గ్రామానికి చెందిన గరికిన భైరవస్వామి కొత్త మొబైల్‌ ఫోన్‌ కొనుక్కోవడానికి రూ.15 వేలు ఇవ్వాలని తల్లిని అడిగాడు. తన వద్ద అంత డబ్బు లేదని ఆమె స్పష్టం చేసింది. దీంతో భైరవస్వామి పెట్రోల్‌ తీసుకొచ్చి ఇంటిలోని గదుల్లో, బీరువా మీద చల్లి, నిప్పు అంటించారు. దీంతో పెద్దఎత్తున మంటలు లేచి ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి. బీరులో దుస్తులు సైతం ఆహుతిఅయ్యాయి. అంతేకాక అగ్నికీలలు పక్కనున్న ఇంటికి కూడా వ్యాపించాయి. ఆ ఇంటిలో కూడా కొన్ని గృహోపకరణాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 15 , 2026 | 01:14 AM