Share News

జేసీగా మల్లవరపు సూర్యతేజ

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:58 AM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

జేసీగా మల్లవరపు సూర్యతేజ

దీర్ఘకాలిక సెలవుపై జాహ్నవి

అనకాపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జేసీగా పనిచేస్తున్న ఎం.జాహ్నవి ఇటీవల దీర్ఘకాలిక సెలవు (మెటర్నరీ లీవ్‌)పై వెళ్లారు. ఆమె స్థానంలో 2020 బ్యాచ్‌కు చెందిన సూర్యతేజను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో మధ్యతరగతి కుటుంబలో జన్మించిన సూర్యతేజ విశాఖలోని గీతం యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేశారు. తరువాత సివిల్స్‌కు సన్నద్ధం అయ్యే క్రమంలో ఎంఏ సైకాలజీ చేశారు. 2019లో జాతీయస్థాయిలో 76వ ర్యాంకు సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యారు. శిక్షణ తరువాత ఏపీ కేడర్‌కే కేటాయించడంతో తొలుత నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా, అనంతపురం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నెల్లూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేశారు. గత ఏడాది సెప్టెంబరులో ఏపీటీఎస్‌ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

Updated Date - Jan 13 , 2026 | 01:58 AM