విశాఖ ఉక్కుపై దుష్ప్రచారం
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:20 AM
విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరిస్తానే దుష్ప్రచారాన్ని ఖండించాలని, కేంద్ర ప్రభుత్వం ప్లాంటు అభివృద్ధికి రూ.11,500 కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తంతో గత మూడు నెలల్లో ప్లాంటు లాభాల బాట పట్టిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
సీతంపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరిస్తానే దుష్ప్రచారాన్ని ఖండించాలని, కేంద్ర ప్రభుత్వం ప్లాంటు అభివృద్ధికి రూ.11,500 కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తంతో గత మూడు నెలల్లో ప్లాంటు లాభాల బాట పట్టిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ద్వారకానగర్ బీవీకే కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై కొన్నిపార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో అర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంటు రూ.1,35,964 కోట్ల వ్యయంతో నిర్మించి, సుమారు 50 వేలపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తగిననిన సీట్లు డిమాండ్ చేసలా బీజేపీ కార్యకర్తలు పార్టీని పటిష్ట పరచాలన్నారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ సూత్రాన్ని ఆచరణలో పెట్టాలన్నారు. ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కార్యకర్తలు శిక్షణను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో బుద్ద లక్ష్మీనారాయణ, సుహాసిని ఆనంద్, విజయనంద్‌రెడ్డి, కేశవకాంత్, సురేష్‌బాబు, పుట్ట గంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ఉక్కుశాఖా మంత్రి
ఉక్కుటౌన్‌షిప్, మార్చి 22 (ఆంఽధ్రజ్యోతి): కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోమవారం విశాఖ స్టీల్‌ప్లాంటుకు రానున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఉదయం ప్లాంటులో పర్యటించనున్నారు. మఽధ్యాహ్నం 12 గంటలకు కొన్ని కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్లతో సమావేశమవుతారు. సమావేశానికి హాజరుకావాలని కార్మిక సంఘాలు, అసోసియేషన్‌లకు యాజమాన్యం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.