Share News

విజృంభిస్తున్న మలేరియా

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:21 PM

మండలంలోని కంఠారం పీహెచ్‌సీ పరిధిలోని పలు గ్రామాలలో మలేరియా చాపకింద నీరులా విజృంభిస్తోంది.

విజృంభిస్తున్న మలేరియా

కంఠారం పీహెచ్‌సీ పరిధిలో

గత ఏడాది 9 కేసులు.. ఈ ఏడాది 39 కేసులు

కొమ్మిక, ఎర్రదిబ్బలుల్లో అధికంగా కేసులు నమోదు

రెండో దఫా స్ర్పేయింగ్‌ చేయించాలని గిరిజనుల వినతి

కొయ్యూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని కంఠారం పీహెచ్‌సీ పరిధిలోని పలు గ్రామాలలో మలేరియా చాపకింద నీరులా విజృంభిస్తోంది. గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు పీహెచ్‌సీ పరిధిలో 9 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 39 కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా జూన్‌ నెలలో 20, జూలై నెలలో 13 కేసులు నమోదయ్యాయి. జనవరి, మార్చి నెలల్లో ఒకొక్కటి, ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు కేసులు వంతున నమోదయ్యాయి. ఇప్పటికే పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాలలో మొదటి దఫా స్ర్పేయింగ్‌ పూర్తయినా కొమ్మిక, బకులూరు సమీప ఎర్రదిబ్బలుల్లో అధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ గ్రామాలలో మలేరియా నియంత్రించేలా స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది చర్యలు చేపడుతున్నా ఫలితం కానరావడం లేదు. మలేరియా మరింత విజృంభించకుండా పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో మరో దఫా స్ర్పేయింగ్‌ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. అలాగే దోమ తెరలు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:21 PM