‘పేటలో భారీ చోరీ
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:39 AM
పట్టణంలోని రాజుగారిబీడు ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆగంతకులు తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో నుంచి 88 గ్రామాల బంగారం వస్తువులను అపహరించుకుపోయారు. ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని కూడా తస్కరించారు. ఈ చోరీకి సంబంధించి సీఐ వినోద్‌బాబు తెలిపిన వివరాలిలా వున్నాయి.
తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసిన ఆగంతకులు
88 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం అపహరణ
పాయకరావుపేట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రాజుగారిబీడు ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆగంతకులు తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో నుంచి 88 గ్రామాల బంగారం వస్తువులను అపహరించుకుపోయారు. ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని కూడా తస్కరించారు. ఈ చోరీకి సంబంధించి సీఐ వినోద్‌బాబు తెలిపిన వివరాలిలా వున్నాయి.
పాయకరావుపేటలోని రాజుగారిబీడు ప్రాంతంలో నివాసం ఉంటున్న మందపాటి రామ్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గత శనివారం విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం తిరిగి వచ్చారు. మెయిన్‌గేటు తీసివుండడం, ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి వుండడంతో ఆందోళనతో లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో బీరువా తెరిచి వుంది. సామాన్లు చిందరవందరగా పడివున్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు 88 గ్రాముల బంగారం వస్తువులు కనిపించలేదు. ఇంటి వరండాలో పార్కింగ్‌చేసిన ద్విచక్రవాహం కూడా లేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ని రప్పించి చోరీ జరిగిన ఇంట్లో పలుచోట్ల వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు లేవని, ఆధారాల కోసం సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సీఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ పురుషోత్తం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.