Share News

రహదారులకు మహర్దశ

ABN , Publish Date - May 26 , 2026 | 11:07 PM

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో రహదారుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రహదారుల నిర్వహణ, అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకు కృషి చేస్తున్నారు.

రహదారులకు మహర్దశ
గ్రామం ప్రారంభంలో నిర్మించిన సిమెంటు రోడ్డు

రూ.60 లక్షలతో సీతారాంపురం రోడ్డు అభివృద్ధి

గోతుల నుంచి విముక్తి కలిగిందని ప్రజలు ఆనందం

పాయకరావుపేట రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో రహదారుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రహదారుల నిర్వహణ, అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో జాతీయ రహదారి నుంచి సీతారాంపురం గ్రామానికి వెళ్లే సుమారు కిలోమీటరు మేర రహదారిని రూ.60 లక్షలతో అభివృద్ధి చేశారు. సీతారాంపురం ఊరులో నుంచి శివారు వరకు 350 మీటర్ల మేర సీసీ రోడ్డు, అక్కడ నుంచి జాతీయ రహదారి వరకు 650 మీటర్ల మేర తారు రోడ్డు నిర్మించారు. అంతకుముందు ఈ రోడ్డు అడుగడుగునా గోతులతో దారుణంగా వుండేది. వర్షం కురిస్తే గోతుల్లో నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొద్ది నెలల క్రితం గ్రామంలో పర్యటించిన మంత్రి అనిత.. రహదారి అభవృద్ధికి నాబార్డు నిధులు రూ.60 లక్షలు మంజూరు చేయించి, శంకుస్థాపన కూడా చేశారు. పీఆర్‌ (ప్రాజెక్ట్సు) శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం జరిగింది. రహదారి అభివృద్ధి చెందడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2026 | 11:07 PM