ఇందేశమ్మ ఘాట్‌రోడ్డుకు మహర్దశ
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:54 PM
మండలంలోని ఇందేశమ్మ ఘాట్‌రోడ్డుకు మంచి రోజులు వచ్చాయి. ఈ రహదారి విస్తరణకు అడుగులు పడుతున్నాయి.
రహదారి విస్తరణకు రూ.16 కోట్లు మంజూరు
కోటవురట్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇందేశమ్మ ఘాట్‌రోడ్డుకు మంచి రోజులు వచ్చాయి. ఈ రహదారి విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ఇందేశమ్మ ఘాట్‌రోడ్డును హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం పరిశీలించారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు రూ.16 కోట్లు మంజూరు చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఇందేశమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఇందేశమ్మ ఘాట్‌రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి అభివృద్ధి పనులు జరిగితే రవాణా కష్టాలు తీరతాయని స్థానికులు చెబుతున్నారు.