సేంద్రీయ పంటల కోసం మేడిన్ అరకు వెల్ఫేర్ సొసైటీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:29 PM
సేంద్రీయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి మేడిన్ అరకు వెల్ఫేర్ సొసైటీ కృషి చేస్తుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు.
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం
బార్ కోడ్‌తోపాటు పలు సేవలు
పాడేరురూరల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి మేడిన్ అరకు వెల్ఫేర్ సొసైటీ కృషి చేస్తుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ సహాయంతో నూతనంగా ఏర్పాటుచేసిన మేడిన్ అరకు వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సొసైటీ ముఖ్యఉద్దేశ్యం అల్లూరి జిల్లాలో సేంద్రీయ పంటలకు నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించడం, ప్యాకింగ్ చేయడం, పండించిన పంటలకు బార్ కోడ్ ఇవ్వడం, సేంద్రీయ పంటలను రైతుబజారుల్లో రైతే అమ్ముకొనే విధంగా ఏర్పాట్లు చేయడం, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, దళారుల వద్ద రైతులు మోసపోకుండా అవగాహన కల్పించడం, పంటలకు ఏపీఈడీ సంస్థ ద్వారా అనుమతి పొందిన కంపెనీల భాగస్వామ్యంతో రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కల్పించడం వంటి కార్యక్రమాలు సొసైటీ చేస్తుందన్నారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో అరకు వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడుగా తామర సురేష్‌బాబు, ఉపాధ్యక్షుడుగా కిల్లో పురుషోత్తం, కార్యదర్శిగా రాపి అప్పారావు, కోశాధికారిగా కిల్లో లక్ష్మయ్య, మెంబర్లుగా నందుల చిన్నగంగులు, గెమ్మెలి రాంబాబు, పాంగి జీనబందు, బూడిద చిన్నబ్బాయి, మఠం సూర్యనారాయణ పడాల్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, ట్రైకార్ అసిస్టెంట్ ఎన్.సీతారామయ్య, ఎ.సంతోష్, 11 మండలాల రైతులు పాల్గొన్నారు.