పిచ్చికుక్క స్వైర విహారం
ABN , Publish Date - May 26 , 2026 | 11:05 PM
బుచ్చెయ్యపేటలో మంగళవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచింది. వీరిలో ఐదుగురు చిన్నారులు, ఓ వృద్ధురాలు కూడా ఉన్నారు.
ఏడుగురిని తీవ్రంగా గాయపరిచిన వైనం
బుచ్చెయ్యపేట, మే 26 (ఆంధ్ర జ్యోతి): బుచ్చెయ్యపేటలో మంగళవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచింది. వీరిలో ఐదుగురు చిన్నారులు, ఓ వృద్ధురాలు కూడా ఉన్నారు. రోడ్డుపై వెళుతున్న వారితో పాటు ఇంట్లో ఉన్నవారిని కూడా పిచ్చికుక్క కరిచింది. దీంతో బుచ్చెయ్యపేటకు చెందిన సాలాపు సుమ, పోలిమరక వినోద్, పడాల హన్సిక, చంద్రిక, దిబ్బిడికి చెందిన సేనాపతి అఖిల్, సీరా కుసుమ తీవ్రంగా గాయపడడంతో వారికి స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి అ 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కందిపూడికి చెందిన వృద్ధురాలు కోమటి పైడమ్మకు బుచ్చెయ్యపేట పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో బుచ్చెయ్యపేట పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. చివరకు బుచ్చెయ్యపేటలో స్థానిక యువకులు ఆ పిచ్చికుక్కను హతమార్చారు.