Share News

అల్లూరి జిల్లా డీఆర్‌వోగా ఎం.వెంకటేశ్వరరావు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:13 PM

జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం.వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అల్లూరి జిల్లా డీఆర్‌వోగా ఎం.వెంకటేశ్వరరావు

అనకాపల్లిలో ఎస్‌డీసీగా ఎం.భుజంగరావు నియామకం

ఎన్నికల నిమిత్తం పది రోజులు అల్లూరి జిల్లాకు కేటాయింపు

పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):

జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం.వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీఆర్‌వోగా పనిచేసిన ఎంవీఎస్‌.లోకేశ్వరరావు గతనెలలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో డీఆర్‌వో పోస్టు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈక్రమంలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎం.వెంకటేశ్వరరావును స్థానిక డీఆర్‌వోగా నియమించారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ ఆర్‌డీవోగా పనిచేస్తూ బదిలీ అయి పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎం.భుజంగరావును అనకాపల్లి జిల్లాకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. అయితే ఎన్నికల పనుల నిమిత్తం డిసెంబరు 10వ తేదీ వరకు ఆయన అల్లూరి జిల్లాలో పనిచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఎన్నికల పనుల నిర్వహణకు పడుతున్న ఇబ్బందులు ఇక తొలగనున్నాయని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:13 PM