డీఎంహెచ్‌వోగా ఎం.రియాజ్‌భాయ్ నియామకం
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:17 AM
స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా ఎం.రియాజ్‌భాయ్‌ను నియమిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కె.పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా ఎం.రియాజ్‌భాయ్‌ను నియమిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కె.పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్‌పై అవినీతి ఆరోపణల నేపథఽ్యంలో ఆయన గత నెలలో సస్పెండైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ తరుణంలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో రెసిడెంట్ అవుట్ పేషెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎన్‌ఏవీవీడీ.రామరెడ్డిని స్థానిక డీఎంహెచ్‌వోగా నియమిస్తూ గత జూలై 23న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన విధుల్లో చేరలేదు. దీంతో అన్నమయ్య జిల్లాలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎం.రియాజ్‌భాయ్‌ను స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన త్వరలో డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.