గంజాయిని గుర్తించిన లైకా
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:05 AM
నగరంలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డ్రగ్స్‌ను గుర్తించడంలో ఏడాదిపాటు శిక్షణ పూర్తిచేసుకుని ఇటీవలే నగర పోలీస్ కమిషనరేట్‌లో చేరిన ‘లైకా’ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు బీచ్‌రోడ్డులో సోదాలు చేశారు. ఈ సందర్భంగా కిరండూల్ పాసింజర్‌లో ఆరు కిలోల గంజాయిని లైకా గుర్తించడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.