Share News

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:16 AM

జాతీయ రహదారిపై మండలంలోని పులపర్తి జంక్షన్‌ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ
నుజ్జయిన లారీ ముందు భాగం

డ్రైవర్‌ మృతి

పులపర్తి జంక్షన్‌ వద్ద ఘటన

ఎలమంచిలి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని పులపర్తి జంక్షన్‌ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

వాటర్‌ ట్యాంకర్‌(లారీ)ను వెనుక నుంచి మరో లారీ డీకొన్న ప్రమాదంలో నుజ్జు నుజ్నైన లారీ ముందు భాగంలో శకటాలు మద్య ఇరుక్కుపోయి లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ నల్గొండ జిల్లా తస్కనిగూడెం కు చెందిన హెచ్‌.వెంకటయ్య (51)మృతి చెందినట్లుగా రూరల్‌ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, స్దానికులు అందించిన వివరాలు ప్రకారం.

జాతీయ రహదారి డివైడర్‌పై ఉన్న మొక్కలకు పులపర్తి జంక్షన్‌ సమీపంలో ట్యాంకర్‌తో నీరు పెట్టుకుంటూ వాహనాన్ని డ్రైవర్‌ నెమ్మదిగా ముందుకు నడుపుకుంటూ వెళుతున్నాడు. ఈ సమయంలో విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో తుని వైపు వెళుతున్న లారీ, వాటర్‌ ట్యాంకర్‌ లారీని వెనుకనుంచి బలంగా ఢీకొన్నది. దీంతో వాటర్‌ ట్యాంకర్‌ లారీ రోడ్డుపై బోల్తాపడగా, దీనిని ఢీకొన్న బొగ్గు లారీ క్యాబిన్‌ నుజ్జయింది. లారీ డ్రైవర్‌ శకలాల మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సుమారు గంటపాటు శ్రమించి లారీ క్యాబిన్‌ శకలాలను తొలగించి, డ్రైవర్‌ను బయటకు తీశారు. కానీ అప్పటికే మృతిచెందాడు. ఇతని స్వస్థలం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చండూర్‌ మండలం తస్ఖనిగూడెం గ్రామానికి చెందిన హెచ్‌.పెంటయ్య (51)గా పోలీసులు గుర్తించారు. సమాచారాన్ని ఇతని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎలమంచిలి సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 01:16 AM