వరాహావతారంలో జగన్నాథుడు
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:09 AM
వరాహావతారంలో జగన్నాథుడు
రథోత్సవాల్లో భాగంగా ఆదివారం జగన్నాథుడు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టర్నర్ చౌల్రీలో కొలువుదీరిన స్వామి రోజుకో అవతారంలో అలరిస్తున్నారు. ఉదయం స్వామికి వైశాఖ ఆగమ సంప్రదాయంలో సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది. వైభవ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో బండారు ప్రసాద్, అర్చకులు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తారు.
- మహారాణిపేట, ఆంధ్రజ్యోతి