Share News

లోకేశ్‌ ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 01:04 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

లోకేశ్‌ ప్రజాదర్బార్‌

పార్టీ కార్యాలయంలో వినతుల స్వీకరణ

మహారాణిపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వాసుల నుంచి వినతులు స్వీకరించారు. వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మినిమం టైమ్‌ స్కేలు ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో విద్యుత్‌ శాఖలో జేఈఈ, జేఎల్‌ఎం పోస్టులు కూడా కలిపి నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరుతూ పలువురు కోరారు. కొత్తగా ప్రారంభించనున్న భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తమ సేవలు వినియోగించుకోవాలని విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోర్టర్లుగా పనిచేస్తున్నవారు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 24 , 2026 | 01:04 AM