లోకేశ్ సార్.. ఆదుకోండి
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:28 AM
ఉపాధి కోసం ఐదు నెలల క్రితం ఒమన్ దేశంలోని మస్కట్ వచ్చాను. ఇక్కడ యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తిరిగి మా ఊరు వెళ్లిపోతానంటే రూ.1.5 లక్షలు కట్టమంటున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. లోకేశ్ సార్... మీరే ఆదుకుని నన్ను మా ఊరు చేర్చేలా చొరవ తీసుకోండి’ అని మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ మల్లంపేట గ్రామానికి చెందిన ఎనికెల శాంతి(32) అనే గిరిజన మహిళ ఒక వీడియో పోస్టు చేసింది.
మస్కట్‌లో చిక్కుకున్న గిరిజన మహిళ వేడుకోలు
అనంతగిరి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి కోసం ఐదు నెలల క్రితం ఒమన్ దేశంలోని మస్కట్ వచ్చాను. ఇక్కడ యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తిరిగి మా ఊరు వెళ్లిపోతానంటే రూ.1.5 లక్షలు కట్టమంటున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. లోకేశ్ సార్... మీరే ఆదుకుని నన్ను మా ఊరు చేర్చేలా చొరవ తీసుకోండి’ అని మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ మల్లంపేట గ్రామానికి చెందిన ఎనికెల శాంతి(32) అనే గిరిజన మహిళ ఒక వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో మండలంలో వైరల్ అవుతోంది. భర్త, ఇద్దరు చిన్న పిల్లలను వదిలి ఉపాధి కోసం శాంతి మస్కట్ వెళ్లి ఇబ్బందులు పడుతోందని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ స్పందించి ఆమెను ఇక్కడకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని మల్లంపేట గ్రామస్థులు కోరుతున్నారు.