Share News

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:19 PM

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నిషాంతి. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా

పాడేరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఎన్నికలపై అధికారులు, సిబ్బంది అవసరమైన శిక్షణ అందించాలని, పోలింగ్‌, అనంతరం నిర్వహించే కౌంటింగ్‌పై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ఎన్నికలు పారదర్శకంగా జరపాలన్నారు. వీడియో కాన్షరెన్స్‌లో కలెక్టర్‌ నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌ కలెక్టర్‌ కె.సాహిత్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:19 PM