పేదల ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:56 AM
ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో ‘డిస్ర్టిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ’ (బ్యాంకర్ల) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో ‘డిస్ర్టిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ’ (బ్యాంకర్ల) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలు, వాటి ఫలితాలను లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పేదల ఆర్థిక అభ్యున్నతికి కోసం ప్రభుత్వాలు వివిధ పథకాలకు ఎంపిక చేస్తున్న లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. ఇంకా ఎంఎస్‌ఎంఈలు, పీఎం సూర్యఘర్ లబ్ధిదారులకు, పిల్లల ఉన్నత చదువులకు, వ్యవసాయానికి విరివిగా రుణాలు అందించాలని సూచించారు. అదే విధంగా వివిధ సంక్షేమ కార్పారేషన్లు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆయా యూనిట్ల ఏర్పాటు కోసం ఉదారంగా రుణాలు ఇవ్వాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు, ఎస్‌హెచ్‌జీ మహిళలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల మంజూరులో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.