Share News

పాడేరులో మద్యం షాపులు మూసివేత

ABN , Publish Date - May 16 , 2026 | 10:49 PM

పాడేరు మోదకొండమ్మ జాతర సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పాడేరులోని నాలుగు మద్యం షాపులను మూసివేయిస్తున్నామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పాడేరులో మద్యం షాపులు మూసివేత

నేటి నుంచి మూడు రోజులు

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌

పాడేరురూరల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మ జాతర సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పాడేరులోని నాలుగు మద్యం షాపులను మూసివేయిస్తున్నామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి నివేదిక ప్రకారం మోదకొండమ్మ జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతత కాపాడుట, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు మద్యం షాపులను శనివారం రాత్రి 10 గంటల తరువాత మూతవేసి సీల్‌ వేస్తామన్నారు. మద్యం వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.

Updated Date - May 16 , 2026 | 10:49 PM