Share News

వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం

ABN , Publish Date - May 23 , 2026 | 11:39 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్‌ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ పిలుపునిచ్చారు

వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం
బెందాళం అశోక్‌ను సన్మానిస్తున్న బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ బెందాళం అశోక్‌

అనకాపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్‌ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ పిలుపునిచ్చారు. జోనల్‌ కో-ఆర్డినేటర్‌గా ఎన్నికైన తరువాత తొలిసారిగా శనివారం అనకాపల్లి టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. అంతకు ముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో టీడీపీ అధ్యక్షుడితో పాటు అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు. గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, పార్టీ పెందుర్తి ఇన్‌చార్జి గండి బాబ్జీ, పార్టీ జిల్లా కార్యదర్శి లాలం కాశీనాయుడు, నాయకుడు దాడి రత్నాకర్‌, తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

Updated Date - May 23 , 2026 | 11:39 PM