Share News

ఆర్గానిక్‌ జిల్లాగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - May 16 , 2026 | 10:55 PM

అందరి సహకారంతో జిల్లాను ఆర్గానిక్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు.

ఆర్గానిక్‌ జిల్లాగా తీర్చిదిద్దుదాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ

‘స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర’లో కలెక్టర్‌ నిషాంతి పిలుపు

పాడేరు, మే 16 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో జిల్లాను ఆర్గానిక్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణానికి కాపాడుతూ, రసాయన ఎరువులకు దూరంగా ఉంటూ సేంద్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేయడం ద్వారా జిల్లాను ఆర్గానిక్‌కు తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. అందుకు అందరూ సహకరించాలన్నారు. పర్యావరణ హితమైన పనులు, వర్థ్యాల పునర్వినియోగం చేసే గ్రీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తడి, పొడి చెత్త, కాఫీ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్‌ వంటి ఎరువుల తయారీతో పర్యావరణం మెరుగుపడుతుందన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, సీపీఆర్‌ సీఈవో వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఎంపీడీవో రతన్‌తేజ్‌, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 10:55 PM