Share News

రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసిరండి

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:32 AM

రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసిరండి
నర్సీపట్నంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి పుష్పగుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ సీఎం రమేశ్‌, జడ్పీ సీఈవో నారాయణమూర్తి

రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసిరండి

స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపు

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మంచి జరగడానికి వారు చేస్తున్న కృషి ఫలించాలని ఆకాంక్షించారు. రాజకీయాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానమని అన్నారు. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగసామ్యం కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భావితరాలకు భరోసా లభిస్తుందని అన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:32 AM