Share News

ఆరోగ్యాంధ్ర సాధిద్దాం

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:15 AM

ఆరోగ్యాంధప్రదేశ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.

ఆరోగ్యాంధ్ర సాధిద్దాం

దినచర్యలో యోగా భాగం కావాలి

హోం మంత్రి వంగలపూడి అనిత

సాగరిక ఫంక్షన్‌ హాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు

బీచ్‌రోడ్డు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

ఆరోగ్యాంధప్రదేశ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని ఆదివారం ఉదయం బీచ్‌ రోడ్డులోని సాగరిక ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాలొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 15 రోజలపాటు యోగా పక్షోత్సవాలు నిర్వహించామన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం సమన్వయంతో యోగా కార్యక్ర మాలను విస్తృతంగా నిర్వహించినట్టు తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామాల్లో యోగా నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా, ధ్యానం అత్యంత అవసరమన్నారు. చిన్నారుల్లో పెరుగుతున్న డిప్రెషన్‌, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ సాధనంగా పేర్కొన్నారు. కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ నెల రోజులుగా జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డిఫెన్స్‌ అండ్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ థీమ్‌తో నేవీ సహకారంతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌, వైట్‌ ఫ్లాగ్‌ బీచ్‌, ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, డీఎఫ్‌వో మేరీ ప్రశాంతి, ఇతర అధికారులు, యోగా అసోసియేషన్‌, వివిధ సంస్థల ప్రతినిధులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో విజేతలకు, విశిష్ట సేవలు అందించిన యోగా గురువులకు అతిథులు సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం ఏయూ విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Jun 22 , 2026 | 01:15 AM