Share News

పొలాల్లో చిరుత ప్రత్యక్షం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:30 AM

పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ లాడపుట్టు గ్రామ సమీపంలోని పొలాల్లో మంగళవారం ఉదయం చిరుతపులి కనిపించింది. చిరుత రాకను స్థానిక గిరిజనులు గమనించి దూరం నుంచి వీడియో తీశారు. అక్కడకు సమీపానున్న కొండ ప్రాంతం నుంచి నీటి కోసం పొలాల్లోకి వచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తమ గ్రామ శివారున చిరుత ప్రత్యక్షం కావడంతో లాడపుట్టు వాసులు భయాందోళన చెందుతున్నారు.

పొలాల్లో చిరుత ప్రత్యక్షం
పాడేరు మండలం లాడపుట్టు పొలాల్లో ప్రత్యక్షమైన చిరుత

ఆందోళన చెందిన గిరిజనులు

పాడేరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ లాడపుట్టు గ్రామ సమీపంలోని పొలాల్లో మంగళవారం ఉదయం చిరుతపులి కనిపించింది. చిరుత రాకను స్థానిక గిరిజనులు గమనించి దూరం నుంచి వీడియో తీశారు. అక్కడకు సమీపానున్న కొండ ప్రాంతం నుంచి నీటి కోసం పొలాల్లోకి వచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తమ గ్రామ శివారున చిరుత ప్రత్యక్షం కావడంతో లాడపుట్టు వాసులు భయాందోళన చెందుతున్నారు.

భయాందోళన చెందవద్దు: అటవీ శాఖాధికారులు

చిరుత సంచారంపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. చిరుత సంచరించిన విషయం తెలుసుకున్న అటవీ రేంజర్‌ ప్రేమ, డిప్యూటీ రేంజర్‌ కాళీప్రసాద్‌లు తమ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చిరుత సంచారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. చిరుత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుక్కలు లేదా పశువులపై మాత్రమే దాడి చేస్తుందని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు సూచించారు. అలాగే గ్రామస్థులు కొన్నాళ్లు ఒంటరిగా సమీపంలోని అటవీ ప్రాంతాల్లో సంచరించవద్దని మూకుమ్మడిగా మాత్రమే వెళ్లాలని సూచించారు. జి.మాడుగుల మండలం వంతల అటవీ ప్రాంతం నుంచి పాడేరు మండలం సంపాల అటవీ ప్రాంతం మీదుగా చిరుత లాడపుట్టు ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:30 AM