Share News

పరిశ్రమల ఏర్పాటుకు భూముల పరిశీలన

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:47 AM

పరిశ్రమల ఏర్పాటు కోసం మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ, డి.పట్టా భూములను సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల కార్యదర్శి యువరాజ్‌ పరిశీలించారు.

పరిశ్రమల ఏర్పాటుకు భూముల పరిశీలన
పైడిపాలలో భూములకు సంబంధించిన మ్యాపులను పరిశీలిస్తున్న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌, జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

పరిశ్రమల ఏర్పాటుకు భూముల పరిశీలన

నాలుగు రెవెన్యూ గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు

ఇప్పటికే 4,259 ఎకరాలు ల్యాండ్‌ బ్యాంకుగా గుర్తింపు

మాకవరపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటు కోసం మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ, డి.పట్టా భూములను సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల కార్యదర్శి యువరాజ్‌ పరిశీలించారు. సమీపంలో వున్న పాపయ్యపాలెం రిజర్వాయర్‌ గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 737 సర్వే నంబరులో ఏ కంపెనీని ఎంతెంత భూమిని కేటాయించారు? ఏయే కంపెనీలు ఏర్పాటవుతున్నాయి వంటి వివరాలను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ నుంచి తెలుసుకున్నారు. కాగా పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల గ్రామాల పరిధిలో రెవెన్యూ అధికారులు ఇటీవల సర్వే చేసి 4,259 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు వున్నట్టు గుర్తించారు. తాజాగా ఈ భూములను, వీటికి సంబంధించిన మ్యాపులను రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించారు. వీటిల్లో అత్యధికంగా డి.పట్టా భూములు వున్నాయి. ఇందులో సాగులో వున్న మామిడి, జీడిమామిడి, సరుగుడు తోటలను వారు చూశారు. వీరి వెంట ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు, ఆర్డీవోఓ వీవీ రమణ, తహశీల్దార్‌ ముజీబ్‌, మండల సర్వేయరు వెంకటేశ్వరరావు వున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:47 AM