భూముల మార్కెట్ విలువ రివిజన్
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:19 AM
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువ రివిజన్ ప్రక్రియ జరుగుతున్నదని జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మథరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వీఎంఆర్‌డీఏ పరిధి మొత్తం అర్బన్‌గా పరిగణన
జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు
అనకాపల్లి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువ రివిజన్ ప్రక్రియ జరుగుతున్నదని జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మథరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాలను అర్బన్‌గా పరిగణించి రివిజన్ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో గ్రోత్ పాయింట్స్, కొత్త లేఅవుట్‌లు వచ్చిన ప్రాంతాలను గుర్తిస్తామని తెలిపారు. భూముల మార్కెట్ విలువ రివిజన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. భూముల కొత్త రిజిస్ట్రేషన్ విలువ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నుంచి అమల్లోకి ఇస్తుందన్నారు.