Share News

జేఎస్‌జేబీ పనుల్లో కొయ్యూరు టాప్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:36 AM

భూగర్భ జలాల పెంపునకు ఉపాధి హామీ పథకంలో మండలంలో నిర్వహించిన జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0 పనుల్లో కొయ్యూరు ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా ఈ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవగా, రాష్ట్రంలో కొయ్యూరు మండలం అత్యుత్తమ పనితీరుతో జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.

జేఎస్‌జేబీ పనుల్లో కొయ్యూరు టాప్‌
మంప సమీపంలో అభివృద్ధి చేసిన చెరువులో పుష్కలంగా నీరు

జాతీయ స్థాయిలో గుర్తింపు

క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు

కొయ్యూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల పెంపునకు ఉపాధి హామీ పథకంలో మండలంలో నిర్వహించిన జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0 పనుల్లో కొయ్యూరు ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా ఈ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవగా, రాష్ట్రంలో కొయ్యూరు మండలం అత్యుత్తమ పనితీరుతో జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడ జరిగిన పనులను గత వారం రోజులుగా క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులు బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్ర స్థాయి బృందం ఈ పనులను పరిశీలించనుంది. అనంతరం జాతీయ స్థాయులో ఈ పనుల నిర్వహణపై అవార్డు ప్రదానం జరుగుతుంది. మండలంలో గత రెండేళ్లుగా సుమారు 14 వేల పనులు నిర్వహించారు. వీటి పనులకు సంబంధించి దశల వారీగా లక్షా 83 వేల ఫొటోలు నమోదయ్యాయి. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫారంపాండ్స్‌, అమృత సరోవర్ల అభివృద్ధి, జీడిమామిడి తోటల్లో కందకాలు, చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు, సాగునీటి కాలువలు పటిష్టం వంటి పనులు నిర్వహించారు.

Updated Date - Jun 30 , 2026 | 12:36 AM