మన్యంలో కెన్యా బృందం పర్యటన
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:17 PM
జిల్లాలో చేపడుతున్న సేంద్రీయ సాగు పద్ధతులను పరిశీలించేందుకు కెన్యా దేశానికి చెందిన బృందం శుక్రవారం పర్యటించింది.
డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో సేంద్రీయ పంటల పరిశీలన
పాడేరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న సేంద్రీయ సాగు పద్ధతులను పరిశీలించేందుకు కెన్యా దేశానికి చెందిన బృందం శుక్రవారం పర్యటించింది. అరకులోయ సబ్ డివిజన్ పరిధిలోని డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి, గిరిజన రైతులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న రాగులు, ఇతర పంటలను పరిశీలించారు. ఇందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. రసాయనిక ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేపట్టే ఎరువులు, క్రిమిసంహార మందుల తయారీని బృందం పరిశీలించింది. గిరిజన ప్రాంతానికి చెందిన పలు రకాల విత్తనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కెన్యా బృందం ఆసక్తి తిలకించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టి.బాబూరావునాయుడు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు.