Share News

కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:22 AM

అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేట గ్రామ పరిధిలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన భూమిని కేవీ భవన నిర్మాణ సంస్థ ఇంజనీర్‌ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ గౌరీశంకర్‌, సర్వేయర్‌ అశ్విని మంగళవారం పరిశీలించారు.

కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన
కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారి ప్రసాద్‌, కేవీ ప్రిన్సిపాల్‌ గౌరీశంకర్‌, సర్వేయర్‌ అశ్విని

కొత్తూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేట గ్రామ పరిధిలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన భూమిని కేవీ భవన నిర్మాణ సంస్థ ఇంజనీర్‌ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ గౌరీశంకర్‌, సర్వేయర్‌ అశ్విని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, సీతానగరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 511లో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేటాయించారని, దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా సర్వేయర్‌, తహశీల్దార్‌ తదితర అధికారులతో మాట్లాడిన అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Updated Date - Apr 01 , 2026 | 12:22 AM