బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా కెజియారాణి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:25 PM
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పాడేరుకు చెందిన బి.కెజియారాణిని నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పాడేరుకు చెందిన బి.కెజియారాణిని నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న కెజియారాణికి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు. అధిష్ఠానం, స్థానిక బీజేపీ నేతలు తనపై పెట్టిన నమ్మకానికి తగినట్టుగా పార్టీకి సేవలందిస్తానని ఈ సందర్భంగా కెజియారాణి పేర్కొన్నారు.