ఇద్దరికి కళారత్న
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:19 AM
రాష్ట్ర ప్రభుత్వం నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది పురస్కారాలను మంగళవారం ప్రకటించింది.
10 మందికి ఉగాది పురస్కారాలు
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. కళారత్న (హంస) అవార్డులు 40 మందికి ప్రకటించగా అందులో విశాఖ జిల్లాకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ దామెర వెంకటసూర్యారావు (సాహిత్యం) ఒకరు కాగా మరొకరు హరి రామమూర్తి(కూచిపూడి). మరో 124 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించగా అందులో పది మంది విశాఖపట్నానికి చెందినవారు ఉన్నారు. కె.సర్వమంగళ గౌరి (సాహిత్యం), జోతిర్మయి మళ్ల (గజల్ సింగర్), గంట్ల శ్రీనుబాబు (జర్నలిజం, సోషల్ సర్వీసు), డాక్టర్ జి.కొండలరావు (జర్నలిజం), చామర్తి బాలభాస్కర్ శత్పతి (టెంపుల్ ఆర్కిటెక్చర్), కలాశనాయుడు మేడపురెడ్డి (సోషల్ సర్వీసు), తెన్నేటి జయరాజ్ (సోషల్ సర్వీసు). శాసుపల్లి రాజకుమారి (సోషల్ సర్వీస్), రొక్కం కిరణ్ కుమార్ (సోషల్ వర్క్), నందవరపు సోములు (సోషల్ సర్వీసు)కు ఉగాది పురస్కారాలు లభించాయి.