Share News

ఏసీబీ వలలో కె.కోటపాడు ఆర్‌ఐ

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:01 AM

ఒక రైతు వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా కె.కోటపాడు మండల ఆర్‌ఐ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీవీవీఎస్‌ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం...మండలంలోని వారాడ గ్రామానికి చెందిన రైతు తనకు చెందిన 1.33 ఎకరాలు వేరొకరి పేరుపై నమోదైందని, దానిని బదిలీ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

ఏసీబీ వలలో కె.కోటపాడు ఆర్‌ఐ
ఏసీబీకి పట్టుబడిన కె.కోటపాడు ఆర్‌ఐ నాగేశ్వరరావు

మ్యుటేషన్‌కు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఒక రైతు వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా కె.కోటపాడు మండల ఆర్‌ఐ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీవీవీఎస్‌ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం...మండలంలోని వారాడ గ్రామానికి చెందిన రైతు తనకు చెందిన 1.33 ఎకరాలు వేరొకరి పేరుపై నమోదైందని, దానిని బదిలీ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ఆర్‌ఐ నాగేశ్వరరావు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు రైతు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన అల్లుడు వర్రి కృష్ణకు ఈ విషయం చెప్పారు. అతను ఈ నెల 14వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు రెవెన్యూ కార్యాలయంలో రైతు వద్ద ఆర్‌ఐ డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ కాపుగాసిన ఏసీబీ బృందం దాడి చేసి ఆర్‌ఐ ఆర్‌.నాగేశ్వరరావును పట్టుకుంది. నేరం చేసినట్టు ఆర్‌ఐ అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఆర్‌ఐ నాగేశ్వరరావుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశామని బుధవారం విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీ పృథ్వీతేజ్‌, సీఐలు సుప్రియ, వెంకటరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 01:01 AM