Share News

జేఎస్‌జేబీ పనులు అద్భుతం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:05 AM

ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపునకు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జల్‌ సంచయ్‌- జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0లో చేపడుతున్న పనులు అద్భుతంగా ఉన్నాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు.

జేఎస్‌జేబీ పనులు అద్భుతం
చొంపి సమీపంలో నీటి కుంట తవ్వకాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

- ఎమ్మెల్సీ నాగబాబు - నీటి కుంటలు, కందకాల పనుల పరిశీలన

అరకులోయ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపునకు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జల్‌ సంచయ్‌- జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0లో చేపడుతున్న పనులు అద్భుతంగా ఉన్నాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. జనసేన సమాచార సేకరణ కమిటీ అరకు పార్లమెంట్‌ పరిశీలకుడిగా అరకులోయకు వచ్చిన ఆయన మంగళవారం ఉదయం చొంపి గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్న నీటి కుంటలు, కందకాల పనులను పరిశీలించారు. ఈ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సిల్వర్‌ ఓక్‌ మొక్కలు నాటి అవి పెరిగిన తరువాత వాటి కింద కాఫీ మొక్కల పెంపకం చేపట్టి గిరి రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపాధి హామీ ఏపీడీ పవన్‌కుమార్‌, ఏపీవో జగదీశ్‌లు నాగబాబుకు వివరించారు. ఒక్క అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 20 లక్షల 60 వేల కందకాలను ఇప్పటి వరకు నిర్మించామన్నారు. లక్ష్యాలను అధిగమించి కందకాల నిర్మాణం చేపట్టామన్నారు. మరో పది లక్షల కందకాలు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ అధికారులు, సిబ్బందిని నాగబాబు అభినందించారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:05 AM