పర్యాటక ప్రదేశాల్లో జోష్
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:43 PM
మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం వీకెండ్ జోష్ కనిపించింది. ప్రస్తుతం పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రకృతి అందాలు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు శీతాకాలం ముగింపు దశకు రావడంతో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది.
సందర్శకులతో మన్యంలో సందడి
పాడేరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం వీకెండ్ జోష్ కనిపించింది. ప్రస్తుతం పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రకృతి అందాలు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు శీతాకాలం ముగింపు దశకు రావడంతో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపించింది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది. దీంతో అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి అధికంగా కనిపించింది.