Share News

గరిష్ఠస్థాయిలో జోలాపుట్టు నీటిమట్టం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:39 AM

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జోలాపుట్టు ప్రధాన జలాశయంలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. కొద్ది రోజులుగా అడపాదడపా వర్షాలు కురవడంతో జలాశయంలోకి వరదనీరు వచ్చి చేరుతున్నది.

గరిష్ఠస్థాయిలో జోలాపుట్టు నీటిమట్టం
జోలాపుట్టు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

- దిగువకు 500 క్యూసెక్కుల నీరు విడుదల

ముంచంగిపుట్టు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జోలాపుట్టు ప్రధాన జలాశయంలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. కొద్ది రోజులుగా అడపాదడపా వర్షాలు కురవడంతో జలాశయంలోకి వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఈ జలాశయంలో 2,750 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, గురువారం 2,746.65 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం ప్రధాన జలాశయానికి ఆనుకొని ఉన్న స్పిల్‌వే డ్యామ్‌ నుంచి 500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో ఉన్న డుడుమకు విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,583.20 అడుగుల నీటిమట్టం నమోదైంది.

Updated Date - Oct 23 , 2026 | 12:39 AM