Share News

గిరిజనులతో జేసీ మమేకం

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:15 AM

క్షేత్రస్థాయిలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, లేదా అనే దానిని పరిశీలించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ సరియా గ్రామాన్ని బుధవారం సందర్శించారు.

గిరిజనులతో జేసీ మమేకం
సరియా గ్రామానికి బైక్‌పై వెళుతున్న జేసీ శ్రీపూజ

మారుమూల సరియా గ్రామం సందర్శన

సంక్షేమ పథకాల అమలుపై ఆరా

అనంతగిరి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, లేదా అనే దానిని పరిశీలించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ మండలంలోని మారుమూల జీనబాడు పంచాయతీ సరియా గ్రామాన్ని బుధవారం సందర్శించారు. కొంతవరకు వాహనంపై వెళ్లి అక్కడ నుంచి సరైన రహదారి లేకపోవడంతో బైక్‌పై సరియా గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ గిరిజనులతో మమేకమై తాగునీరు, రోడ్డు, రేషన్‌, భూ సమస్యలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తోందని, ఎదురవుతున్న సమస్యలపై నివేదికలను తయారుచేసి, పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీడీవో ప్రభాకర్‌, తహశీల్దార్‌ వీరభద్రాచారి, కార్యదర్శి రమ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:15 AM