జేసీ, పీవో బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:15 PM
పాడేరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
జాయింట్ కలెక్టర్‌గా శ్రీపూజ..
ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ..
మోదకొండమ్మను దర్శించుకున్న దంపతులు
పాడేరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పాడేరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇన్‌చార్జిగా జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించడంతో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆదిత్యవర్మను ఐటీడీఏ పీవోగా నియమించడంతో ఆయన శనివారం ఉదయం శ్రీపూజ నుంచి ఐటీడీఏ పీవోగా బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా ఐటీడీఏ ఏవో హేమలత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు.
మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు
ఐఏఎస్ అధికారులు శ్రీపూజ, ఆదిత్యవర్మ శనివారం ఉదయం స్థానిక మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఐఏఎస్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. మోదకొండమ్మను దర్శించుకున్న అనంతరం వారిద్దరూ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం యువ ఐఏఎస్ దంపతులు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి పయనమయ్యారు.