Share News

జయహో అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:06 AM

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచారు.

జయహో అమరావతి
కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌. పక్కన ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇతర అధికారులు, ఉద్యోగులు

పార్లమెంటులో రాజధాని బిల్లు ఆమోదంతో మిన్నంటిన సంబరాలు

బాణసంచా కాల్పులు, కేక్‌ కటింగులు

మిఠాయిలు పంచిన కూటమి పార్టీల శ్రేణులు

కొవ్వొత్తులు వెలిగించి ఆనందోత్సవాలు

పాడేరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచారు. పార్టీ జెండాలతోపాటు త్రివర్ణ పతాకాలను చేతబూని బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ‘మన రాజధాని అమరావతి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరావతి బిల్లును ఆమోదించిన పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో జిల్లా కేంద్రం పాడేరులో కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాలతో తెలుగు మహిళలు బొర్రా విజయరాణి, డి.కుమారి, పి.వరలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.వెంకటరమణ, ఐటీడీపీ ఇన్‌చార్జి బుద్ద జ్యోతికిరణ్‌, నేతలు డీపీ.సురేశ్‌కుమార్‌, కె.రమేశ్‌నాముడు, బాబూరావుపడాల్‌, ఆర్‌.కొండబాబు, బుక్కా జగదీశ్‌, తదితరులు స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌లో ’జై అమరావతి’ అంటూ నినాదాలు చేసి, మిఠాయిలు పంచారు. జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ క్యాంప్‌ కార్యాలయం ముందు టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణ, సత్యనారాయణ త్రినాథ్‌, మురళి, తదితరులు సంబరాలు చేసుకున్నారు.

కలెక్టరేట్‌లో వేడుకలు

కలెక్టరేట్‌లో గురువారం రాత్రి ‘జయహో అమరావతి’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ కేకును కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు జయహో అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో నీలకంఠం, డ్వామా పీడీ విద్యాసాగర్‌, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

అరకులోయలో టీడీపీ ఇన్‌చార్జి దొన్నుదొర ఆధ్వర్యంలో కూటమి నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. చింతపల్లిలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు ఆధ్వర్యంలో నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 01:06 AM