Share News

జనుము పూల సోయగం

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:40 AM

వరి మాగాణులో రబీ పంటగా సాగు చేసిన జనుము.. ప్రస్తుత పూత దశలో వుంది. మండలంలోని పలు గ్రామాల్లో పశువులకు ఎండు మేత కోసం, ఖరీఫ్‌ సీజన్‌కు ముందు పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు జనము పంటను వేశారు.

జనుము పూల సోయగం

చోడవరం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వరి మాగాణులో రబీ పంటగా సాగు చేసిన జనుము.. ప్రస్తుత పూత దశలో వుంది. మండలంలోని పలు గ్రామాల్లో పశువులకు ఎండు మేత కోసం, ఖరీఫ్‌ సీజన్‌కు ముందు పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు జనము పంటను వేశారు. దాదాపు అందరూ ఒకేసారి విత్తనాలు వేయడంతో ప్రస్తుతం పూత దశలో వున్నాయి. మన్యంలో వలిసె పూల మాదిరిగా జనుము పైరు కూడా పసుపు పచ్చ పూలతో చూపరులను ఆకట్టుకుంటున్నది. పొలాల మధ్య నుంచి వెళుతున్న రహదారిపై ప్రయాణిస్తున్న పలువురు.. ఇక్కడ ఆగి మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు తీసుకుంటున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:40 AM