Share News

జనసేన పార్లమెంట్‌ సమన్వయ కమిటీ

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:37 AM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంట్‌ సమన్వయ కమిటీని నియమించింది. కూటమిలో మిగిలిన రెండు పార్టీలతోపాటు సొంత పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అఽధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఈ కమిటీ నియామకం జరిగినట్టు సమాచారం.

జనసేన పార్లమెంట్‌ సమన్వయ కమిటీ

స్థానిక ఎన్నికల నేపథ్యంలో 36 మందితో ఏర్పాటు

అనకాపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంట్‌ సమన్వయ కమిటీని నియమించింది. కూటమిలో మిగిలిన రెండు పార్టీలతోపాటు సొంత పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అఽధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఈ కమిటీ నియామకం జరిగినట్టు సమాచారం. ఇందులో ఐదుగురు సమన్వయకర్తలు, 31 మంది సభ్యులు వున్నారు. సమన్వయకర్తలుగా ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌, సీనియర్‌ నేతలు పీవీఎస్‌ఎన్‌ రాజు, ఎం.సన్యాసినాయుడు, ఎం.శ్రీవేణి నియమితులయ్యారు. నిర్వాహక్‌ దళ్‌ సభ్యులుగా సుంకర మహేశ్‌, కొసిరెడ్డి త్రినాథరావు, దొండ కుసుమ, గవిరెడ్డి తిరుపతిరావు, రామన్నరావు అల్లం, పచ్చికూర గోవిందరావు, తెలుగుచర్ల మహేశ్వరరావు, సహబోయిన గోవింద, దిబ్బిడి సన్యాసినాయుడు, దాసరి అచ్యుతరావు, ఎం.సత్తిబాబు, పి.కల్యాణచక్రవర్తి, మీసాల సత్యనారాయణ, పి.ప్రసాద్‌బాబు, ఎ.సురేశ్‌, ఎ.రమేశ్‌, ఆర్‌.అచ్చియ్యనాయుడు, గూనూరు సూర్యనారాయణ, గెడ్డం చలపతిరావు, ఎం.నాగసుధ, బలిరెడ్డి ప్రసాద్‌, వి.నరేశ్‌, బి.సింహాచలం, బి.సత్యనారాయణ, కె.మధు, ఎస్‌.సోమశేఖర్‌నాయుడు, ఎల్‌.సుధీర్‌, పి.శివశంకర్‌, ఎ.వెంకట సత్యనారాయణ, గుర్గాల శేఖర్‌, డి.సత్యనారాయణలను నియమించారు.

Updated Date - Oct 10 , 2026 | 12:37 AM