27 మందితో జనసేన సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:16 AM
జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అరకులోయ పార్లమెంట్ స్థానంలోని 27 మంది నేతలతో జనసేన సమాచార సేకరణ కమిటీని బుధవారం నియమించారు.
కమిటీ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ నాగబాబు
పాడేరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అరకులోయ పార్లమెంట్ స్థానంలోని 27 మంది నేతలతో జనసేన సమాచార సేకరణ కమిటీని బుధవారం నియమించారు. ఇందులో భాగంగా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును పరిశీలకుడుగా నియమించిన సంగతి పాఠకులకు తెలిసిందే. అలాగే బుధవారం 26 మంది పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆ కమిటీలో సీనియర్ సభ్యులుగా జి.సత్తిబాబు(పాలకొండ), కిల్లో బాబూరావు(అరకులోయ), వి.విశాలాక్షి(రంపచోడవరం), ఎల్.రంజిత్‌కుమార్(కురుపాం), విశ్వనాథం(పాలకొండ), వరలక్ష్మి(రంపచోడవరం), పరిశీలన కమిటీ సభ్యులుగా పి.చాందిని(బొబ్బిలి), ఎ.మణి(పార్వతీపురం), సి.అనిల్‌కుమార్(పార్వతీపురం), కోటేశ్వరరావు(అరకులోయ), కె.రమేశ్(అరకులోయ), పీవీఎస్ అప్పారావు(రంపచోడవరం), పి.సతీశ్(రంపచోడవరం), పి.శేఖర్(సాలూరు), పి.మురళీ(సాలూరు), ఎస్‌బీ.సాయిజయంతి(పాడేరు), మాసాడ భీమన్న(పాడేరు), కె.కృష్ణమూర్తి(పాడేరు), సి.సతీశ్‌బాబు(పాడేరు), వి.ఉపేంధ్ర(కురుపాం), పి.శంకరరావు(కురుపాం), జి.గౌరికృష్ణారావు(కురుపాం), జి.వరలక్ష్మి(పాలకొండ), ఎం.సంతోశ్‌కుమార్(పాలకొండ), ఎం.పుండరీకం(పాలకొండ), ఆర్.కృష్ణకుమార్(పాలకొండ), వి.రవికుమార్(పాలకొండ)లను నియమించారు. ఈ కమిటీ అరకులోయ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడంతో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఆ వివరాల నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తుంది.