స్థానిక ఎన్నికలకు జనసేన కమిటీలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:18 AM
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రకటన జారీచేసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త, ముగ్గురు సభ్యులను నియమించింది. వారికి సహాయంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసింది. అందరికీ ఈ నెల 9న మంగళగిరిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.
విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
బృందంలో మరికొందరు నియామకం
9న అవగాహన కార్యక్రమం
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రకటన జారీచేసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త, ముగ్గురు సభ్యులను నియమించింది. వారికి సహాయంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసింది. అందరికీ ఈ నెల 9న మంగళగిరిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.
విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం సమన్వయ బృందంలో పంచకర్ల సందీప్, పసుపులేటి ఉషాకిరణ్, వన్నంరెడ్డి సతీశ్‌కుమార్, అనకాపల్లి కమిటీలో పీవీఎస్‌ఎన్ రాజు, గెడ్డం బుజ్జి, అద్దేపల్లి సౌజన్యను నియమించారు. సహాయక బృందంలో విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి శివ దేవర, గవర సోమశేఖరరావు, మల్లువలస శ్రీను, భోగిల శ్రీనివాస పట్నాయక్, నీరుకొండ దివాకర్, గరికిన రవి, దుంగా దేవన్ రాజులను, అనకాపల్లికి కసిరెడ్డి త్రినాథ్, ఎ.రమాదేవి నాయుడు, కొమర హేమంత్, సల్లదుల ప్రసాద్, దేవవరపు రాజా, కరణం అప్పారావు, ఎం.శ్రీవేణిలను నియమించారు.