విశాఖ మదిలో జానకి
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:12 AM
సుప్రసిద్ధ సినీ నేపథ్యగాయని ఎస్.జానకికి విశాఖపట్నంతో ఎంతో అనుబంధం ఉంది.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలుమార్లు రాక
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
సుప్రసిద్ధ సినీ నేపథ్యగాయని ఎస్.జానకికి విశాఖపట్నంతో ఎంతో అనుబంధం ఉంది. నగరంలో కళాభారతి, గురజాడ కళాక్షేత్రం, ఉక్కునగరం కల్చరల్ క్లబ్, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 28న నగరంలోని ఉషోదయ జంక్షన్ సమీపాన గల బంధువుల ఇంటికి జానకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు...ఆమెను కలిసి ఫొటోలు దిగారు. విశాఖ అంటే జానకి ఎంతో ఇష్టపడేవారని కల్చరల్ అసోసియేషన్‌ల ప్రతినిధులు గుర్తుచేసుకుంటున్నారు. కళాభారతిలో జానకికి జీవన సాఫల్య పురస్కారం అందించి స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. నగరంలో అనాథ శరణాలయాలకు స్వచ్ఛందంగా దానాలు చేయడమే కాకుండా వాటికి నిధుల సేకరణకు ఉచితంగా కార్యక్రమాలు చేసేవారని పలువురు వెల్లడించారు.