35 మందితో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ సమన్వయ కమిటీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:26 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ 35 మందితో అరకులోయ పార్లమెంట్ స్థానంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
సమన్వయకర్తలుగా నాగబాబు, జయకృష్ణ, గంగులయ్య
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ 35 మందితో అరకులోయ పార్లమెంట్ స్థానంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమి చైర్మన్ వంపూరు గంగులయ్యలను నియమించింది. ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన మరో 32 మందిని సభ్యులుగా నియమించింది. వారిలో కిలో బాబూరావు, కె.మధుసుదనరావు, ముల్లంకి శ్రీనివాసరెడ్డి, సమర్థి రఘునాథ్, నేరుడుబిల్లి వంశీ, గౌరీ శంకరరావు, మురళీకృష్ణ పాండా, శంకరరావు, శ్రీనివాసులు, త్రిముర్తులు, బొంకుల దివ్యలత, పులి సీతారామ్, భావనసాయి జయంతి, ఎం.భీమన్న, శంకరరావు, ప్రశాంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్, సాయికుమార్, మండంగి యోగేశ్, వైవీఎస్.రాజకుమార్, బోనెల గోవిందమ్మ, అరుదు శ్రీను, కె.విశ్వేశ్వరరావు, పైలా శ్రీనివాసరావు, కరుణకుమార్, గణేశ్వరరావు, సాలూరు చాంధిని, వినయ్‌ప్రసాద్, సాయిబాబా, కాకిస్వామి, పాండా వరలక్ష్మి, వనగదుల గోవింద్, సపోర్ట్ టీమ్‌లో శేఖర్, వెంకటసుబ్బయ్య, నాయుడుబాబు, పైలా సత్యనారాయణ, వీరేంద్రరెడ్డి ఉన్నారు. ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.