ఎలమంచిలిలో జనసేన నామినేషన్
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:01 AM
స్థానిక మునిసిపల్ చైర్పర్సన్ పదవికి జనసేన పార్టీ తరపున శుక్రవారం కర్రి ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రైల్వేస్టేషన్ రోడ్డులోని నివాసం నుంచి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు బొద్దపు శ్రీనుతోపాటు నాయకులు రాజాన శేషు, వూటకూటి రమేశ్ నాయుడు, కొఠారు శ్రీను, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఎలమంచిలి మునిసిపల్ ఎన్నికలకు శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలైనట్టు కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కర్రి ఝాన్సీ, 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్.రమణ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారన్నారు.
చైర్పర్సన్ పదవికి కర్రి ఝాన్సీ దాఖలు
ఎలమంచిలి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపల్ చైర్పర్సన్ పదవికి జనసేన పార్టీ తరపున శుక్రవారం కర్రి ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రైల్వేస్టేషన్ రోడ్డులోని నివాసం నుంచి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు బొద్దపు శ్రీనుతోపాటు నాయకులు రాజాన శేషు, వూటకూటి రమేశ్ నాయుడు, కొఠారు శ్రీను, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఎలమంచిలి మునిసిపల్ ఎన్నికలకు శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలైనట్టు కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కర్రి ఝాన్సీ, 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్.రమణ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారన్నారు.
నేడు వైసీపీ, కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థుల నామినేషన్లు
ఎలమంచిలి చైర్పర్సన్ పదవికి వైసీపీ తరపున బొద్దపు తులసి శనివారం నామినేషన్ దాఖలు చేస్తారని మాజీ ఎంపీపీ బొద్దపు యర్రయ్యదొర తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కరణం ధర్మశ్రీ, యూవీ రమణమూర్తి రాజు, బొడ్డేడ ప్రసాద్, తదితరులు హాజరుకానున్నారని చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థినిగా నాగుమంత్రి శాంతి నామినేషన్ వేస్తారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగుమంత్రి సాయి తెలిపారు.