Share News

రూ.535 కోట్లతో జలధార- జలహారతి పనులు

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:34 AM

జిల్లాలో జలధార- జలహారతిలో భాగంగా రూ.535 కోట్లతో ఆయా పనులు చేపడుతున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

రూ.535 కోట్లతో జలధార- జలహారతి పనులు
సీఎం చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నిషాంతి, ఇతర అధికారులు

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ టి.నిషాంతి

ఆయా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి

పాడేరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలధార- జలహారతిలో భాగంగా రూ.535 కోట్లతో ఆయా పనులు చేపడుతున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జలధార- జలహారతిపై సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నిషాంతి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రూ.535 కోట్లతో 9,430 జలధార- జలహారతి పనులు చేపడుతున్నామని, వాటిలో ఇప్పటికే 9,339 పనులు పూర్తి చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా 9,430 పనులు మంజూరైన జిల్లాగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఫలితంగా భూగర్భ జలాల పెరుగుదల, వాన నీటి సంరక్షణ, పచ్చదనం అభివృద్ధి జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో మిగిలిన జలధార- జలహారతి పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదే శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగరరావు, చిన్ననీటి పారుదల శాఖ ఈఈ ఆర్‌.రాజేశ్వరరావు, అనుబంధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:34 AM