ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి జగన్ హాజరు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:13 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో అరకులోయ చేరుకున్నారు.
హెలికాప్టర్‌లో అరకులోయ వచ్చి వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణం
అరకులోయ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో అరకులోయ చేరుకున్నారు. తాంగులగుడ ఆలయ సమీపంలో జరుగుతున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు చాణక్య వివాహ వేదిక వద్ద వరకు ప్రత్యేక వాహనంలో వచ్చారు. జగన్‌కు ఎమ్మెల్యే దంపతులు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వధూవరులను జగన్ ఆశీర్వదించారు. వివాహ వేదిక వద్ద ఆరు నిమిషాల పాటు ఉండి తిరిగి హెలీప్యాడ్‌కు బయలుదేరారు. దారి పొడవునా ఉన్న పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. హెలీప్యాడ్ వద్ద పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి హెలికాప్టర్‌లో విశాఖపట్నం వెళ్లిపోయారు. ఈ వివాహానికి మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, తదితరులు హాజరయ్యారు.